Sunday, August 9, 2009

ఎవ్వరు ఒంటరి కాదు ...

ఎవ్వరు ఒంటరి కాదు ...
పుష్పించే పువ్వు నేలరాలే క్షణాన నేనున్నానంటూ తోడూ వస్తుంది నేల
నేల
రాలే ప్రతి వర్షపు బిందువుని కూడా నేనున్నానంటూ అక్కున చేర్చుకుంటుంది బీడు భూమి
నిత్యం ఎదురయ్యే చీకటిని సైతం తన ఒడిలోకి చేర్చుకొని వెలుగునిస్తుంది ప్రతి వేకువ
నీరాశతో నిత్యం జీవించే మనిషి జీవితంలో కూడా అందమైన ఆశలు నేరవేర్చే ప్రయత్నం చేస్తుంది అందమైన కల
మౌనమ్
వహించి వున్నా మాత్రమున మనసు మూగబోయింది అని భ్రమించటం ఆవివేకం
సన్నిహిత
నేస్తం కోసం అన్వేషణ సాగిస్తూ .... బంధుత్వం మించిన స్నేహబంధంకై నిరిక్షిస్తుంది ...!!
మౌనం
వహించిన మాత్రాన మనసు పలుక లేదని కాదు ..!
పలుకుల
ప్రయాణంలో .... ఆత్మీయతాబాటని వెతుకుతూ...!! స్నేహమనే పూల బాట పొందే చిరుక్షణంలో ...! మౌనం అనే చిన్న ఎడబాటు కూడా మరిచిపోని అనుబంధంలో తియ్యని అనుబంధంగా,
సాగే
జీవన స్మృతులలో ఆనంద దోలికలుగా భావిస్తాయి... ఎవ్వరు ఒంటరి కాదు అని అనుక్షణం మనసుకు గుర్తు చేస్తాయి
శ్రీరాం కుమార్ భాగవతుల

Monday, August 3, 2009

ప్రియ నేస్తమా...

చెలియా లేక చెలిమి మూగబోయిన ... పెదవిపై చిరునవ్వే కరువాయనా...
చెలియా
పలుకులే ముత్యాలగా, ఆమె నవ్వే మకరందం మనుకున్నానే ... విరబూసిన చెలియా మోమునె నాలో ఉపిరిగా నిలిపుకున్నానే ...
చెలి
గజ్జెల గల గల నాదం నా గుండె చప్పుడికి తోడూ చేసుకున్నానే ...
చెలి ఆదరామ్రుతమె నా ప్రాణముగా, ఆమె నేనుగా భావించానే ...
పుష్పించే
విరికి తుమ్మేదవంటు, నేల రాలే ప్రతి వర్షపు జల్లుకి నీవే హరివిల్లువంటు ఉహించానే ...
చీకటిలో
వెన్నలల, నిదురలో మదుర స్వప్నంలా నీతో నా చెలిమి తోడూ వుండాలి అని బాసచేసానే
మరుజన్మ
లో కూడా నేను నీ తోడుంటానని పలికి నన్నునేను మరిచాను... ప్రియ నేస్తమా...!!
శ్రీరాం కుమార్ భాగవతుల

ఓ మనిషి ...

గుండెలోని భాద కన్నిళ్ళుగా మారితేనే గుండె బరువు తీరుతుంది అంటే
ప్రతిరోజూ
చెయ్యాలి జలయజ్ఞం ...
కష్టాలు
ఎదురైనప్పుడే జీవితానికి అర్ధం ఏర్పడుతుంది అని నమ్మితే
సుఖం
అనే పదానికి చెప్పాలి స్వస్తి ...
కాలచక్రం
గమనంలో స్వార్ధానికి విలువ పెరిగితే
సహజమైన
ప్రేమ, ఆప్యాయతలకు పలకాలి వీడుకోలు ...
నేను
, నాది అనేవి పరిపాలకులైతే ఆశకు మరణశిక్ష విధించాలి,
మనిషిగా
మరణించి మృగంగా జన్మించాలి ...

శ్రీరాం
కుమార్ భాగవతుల

Saturday, August 1, 2009

సంధ్యారాగం తో స్వప్నం ...
విశాల
ఆకాశంలో విహారం ...
నళిని బిందువులతో జలకాటం ...
వసంత కోకిలతో గానామృతం ...
ఇలా ఎన్నో... ఎనెన్నో ఆశలతో, కలలతో వినీలా
ఆకాశంలో పయనించే మిత్రమా ...
ఒక్కక్షణం ఆనాటి జ్ఞాపాకాలుకు ఆహ్వానం
పలుకుధమా ...
ముద్దుగా మనం ఆడిన ఆటలు ...
సద్దుగా మనం చేసిన అల్లరి ...
పల్లెటూరిలో పట్నపు పరుగులు ... హాస్టల్ మెస్సులతో ఆగచాట్లు ...
పరిక్షలకై పొరుగూరు పయనం ... టీచర్స్ డే లతో హడావిడి ...
పరిచయం లేని పురుగులతో జాగారాలు ... రాత్రి వేళలోకబుర్లతో కాలక్షేపం...
హద్దు తెలియని ఆనందం ... పొద్దేఎరగని స్నేహ మకరందం ... ఇలా వర్ణించుకుంటే ... ఎన్నో ... ఎనేన్నూ ...
అందుకే మిత్రమా ఎవరేనా అడిగితె
ఆకాశం లోతెంత అంటే అంతులే ఆవలి వైపుగా
మన స్నేహానికి వయసెంత అంటే కడకట్టే కాలేవరకు... చివరి కన్నీటి బొట్టు రాలేవరకు అని ఆనందంగా చెబుతాను ...

శ్రీరాం కుమార్ భాగవతుల

ఆశ ...

ఆశకి ఆక్షరాలు ... ఆనందానికి అవధులు లేవు
ముసుగు వేసుకొని వున్నా... మౌనమ్ వహిస్తున్న ... మనసు మాత్రం అనుక్షణం భావోవేసంతో పరితపిస్తుంది
నీరాశ ఎదురవుతున్న... బ్రతుకు భారమవుతున్న ... రేపటి ఉదయం కోసం ఎదురు చూస్తుంది

శ్రీరాం కుమార్ భాగవతుల

Thursday, July 30, 2009

జీవితం ...

నచ్చని ఎన్నో విషయాలతో రాజి పడటం ... జీవతం
తెలియని ఎన్నో ప్రశ్నలకు పరిచయం కావటం ... విశ్లేషణం
అర్ధం కాని ఆలోచనలతో శోక సముద్రంవైపు వెళ్ళటం ... అవివేకం
బ్రతుకు బరువు అవుతున్న సాదించాలనుకోవటం ... సామర్ద్యం


శ్రీరాం కుమార్ భాగవతుల

Thursday, March 26, 2009

ఆమని ...


ఆమని ఆగమనం స్వాగత గీతం
కోయిల స్వరం సప్తస్వరాల సమ్మేళనం
వీచే గాలి మృదుమధుర శ్రావ్యం
నెమలి నృత్యం నటరాజ ప్రతిరూపం

శ్రీరాం కుమార్ భాగవతుల


Published in Selayeru feature at http://www.aavakaaya.com/ on Apr 6th 2009

Friday, January 9, 2009

ఏమిటి నీ దైర్యం ... ఎందుకంత సాహసం ...

ఏమిటి నీ దైర్యం ... ఎందుకంత సాహసం ...
కష్టాలు
నిన్ను వెంటాడుతున్న
అర్ధం
లేని ఆశలతో, ఆలోచనలతో జీవిస్తున్నావు
ప్రేమను
పంచె హృదయా కిరణాలు నీ పై ప్రకాశింపకున్నా
రేపటి ఉదయ కిరణాల కై ప్రతి
క్షిస్తూ ఉహల్లో బ్రతికేస్తున్నావు
స్నేహం
భావంతో నిన్ను హత్తుకొనే మనస్సు నీ దరిలేకున్నా
చిలిపి నవ్వుని వెంట తీసుకోని అవకాశమనే
కళల లోకం కోసం వెతుకుతున్నావు
నీకంటూ
తోడూ లేకున్నా
వున్నవాళ్ళు
అందరు నావాళ్ళే అనే ఆపోహాతో ఆదమరిచి మసలుతున్నావు
ఆప్యాతను
పంచె సుపరిచితులు లేకున్నా, అంతులేని ఆనంద వీధుల్లో బ్రతికేస్తున్నావు
నీ
కనులలో కన్నీళ్ళు ఇంకి పోయిన, కలతలే లేని కళేభరంలా జీవిస్తున్నావు
ఓరి
మానవుడా ఏమిటి నీ దైర్యం ...
కష్టాలే
ఇంటి పేరుగా మారితే ఆశలే ఆలోచనలు అవుతాయి
ఒంటరితనం
ఆలవాటు అయితే ఉహలే తోడూ వస్తాయి
మంచితనం
శాపంగా మారితే స్నేహితులే శత్రువులుగా ప్రస్పుతిస్తారు
తోడూ లేక, ఆప్యాత కొరత అయితే ఒంటరినై ఆదమరచి చీకటి వీధుల్లో విహరించే సాహసం చెయ్యటం తప్పఇంకేమి చెయ్యగలను...
శ్రీరాం కుమార్ భాగవతుల

Saturday, January 3, 2009

మాతృదేవోభవ ...

ఆశ అనే వీధిలో నడిచే బాటసారి
నీవు
ఆశించే నిన్ను సృస్తించన అమ్మ విలువ ఎట్టిదో నీకు తెలుసా
కష్టాలా
కావడిని కన్నిలతో మోసేది అమ్మ
కడుపు
కోతనే మధుర గాయంగా మలిచుకోనేది అమ్మ
ప్రేమనే
మాటను పరిచయం చేసేది అమ్మ
మమతన్న
తీపి రుచి పంచిఇచ్చేది అమ్మ
అమ్మానే
మదుర నిజం చేదనిపించదు నిమిషం
కని
పెంచే మాత్రుముర్తికి భారమనిపించదు తరుణం
కాని
... ఆశావాది... కని పెంచే మాత్రుముర్తి భారమనుకుంటే
కనిపించని దైవము భ్రమకాకపోదా
కుర్రెంసిలతో
అమ్మ ప్రేమని వేలకట్టే ప్రయత్నిచే క్షణం
కన్నిల్లకై
అనునిత్యం జరిపించాలి జలయజ్గ్నం
అందుకే ప్రతి క్షణం మిగిలించు అమ్మనే వెలుతురిని తరలించు స్వార్ధమనే చీకటిని

శ్రీరాం
కుమార్ భాగవతుల

Published in KOUMUDI TELUGU WEB MONTHLY in the month of February 2009

Thursday, December 25, 2008

జీవిత సత్యాలు ...

నిరాశ ఓటమికి, ఆశ గెలుపుకి మూలం
మరణం వేదాంతానికి, జీవితం నిజానికి పరిచయం
కష్టాలు అనుభవానికి, సంతోషం తీపి జ్గ్నపకాలకి నాందీ
ప్రియురాలు బాధకు, స్నేహితుడు ఓదార్పుకి
తోడూ
ఆకలి అమ్మని, బాద్యత నాన్నని ప్రస్పుతిన్చును
చదువు
విజ్ఞానానికి, సంస్కారం
వినయానికి మార్గం
మనిషికి మంచి, మనసుకి ఆత్మీయత అర్దాలు
ఏనాటికి చెరగిపోని నిజాలు ఆనాటినుంచి నమ్మిన సిదాంతాలు...
మనిషిని మనిషిగా నమ్మి విదించిన అర్ధాలను కాలంతో, జీవితంతో పోరాడలేక అలసిన మనవుడు ...
స్వార్ధం అనే చిన్ని మాటను తన బాటగా చేసుకొని ఆసత్యమనే ముసుగులో జీవించటం అలవాటుచేసుకున్నాడు జీవిత మనే సత్యానికి సమాధి కడుతున్నాడు ...
శ్రీరాం కుమార్ భాగవతుల

About Blogger

My photo
Klagenfurt, Carinthia, Austria
About Me. In all the world, there is no one else exactly like me. Everything that comes out of me is authentically mine, because I alone chose it. So very few statements allowed to say about my self. Basically I belongs to Visakhapatnam's district Andhra Pradesh State, India. All the way my girlfriends keep their perspective that I am a simple, loving and friendly person. But all the time i was trying to refuse their statements. And they tried differently to add more flavor that iam also amicable, soft spoken person. One thing I can say that believe in the basic family values. I have high regards to my friends. I am like a book, with pages that have stuck together for want of use my mind needs unpacking and the truths stored within must be turned over from time to time, to be ready when occasion demands I like to be good manager because a good manager is a man who isn't worried about his own career but rather the careers of those who work for him