
కష్టాలు నిన్ను వెంటాడుతున్న
అర్ధం లేని ఆశలతో, ఆలోచనలతో జీవిస్తున్నావు
ప్రేమను పంచె హృదయా కిరణాలు నీ పై ప్రకాశింపకున్నా
రేపటి ఉదయ కిరణాల కై ప్రతిక్షిస్తూ ఉహల్లో బ్రతికేస్తున్నావు
స్నేహం భావంతో నిన్ను హత్తుకొనే మనస్సు నీ దరిలేకున్నా
చిలిపి నవ్వుని వెంట తీసుకోని అవకాశమనే కళల లోకం కోసం వెతుకుతున్నావు
నీకంటూ ఎ తోడూ లేకున్నా
వున్నవాళ్ళు అందరు నావాళ్ళే అనే ఆపోహాతో ఆదమరిచి మసలుతున్నావు
ఆప్యాతను పంచె సుపరిచితులు లేకున్నా, అంతులేని ఆనంద వీధుల్లో బ్రతికేస్తున్నావు
నీ కనులలో కన్నీళ్ళు ఇంకి పోయిన, కలతలే లేని కళేభరంలా జీవిస్తున్నావు
ఓరి మానవుడా ఏమిటి నీ దైర్యం ...
కష్టాలే ఇంటి పేరుగా మారితే ఆశలే ఆలోచనలు అవుతాయి
ఒంటరితనం ఆలవాటు అయితే ఉహలే తోడూ వస్తాయి
మంచితనం శాపంగా మారితే స్నేహితులే శత్రువులుగా ప్రస్పుతిస్తారు
ఎ తోడూ లేక, ఆప్యాత కొరత అయితే ఒంటరినై ఆదమరచి చీకటి వీధుల్లో విహరించే సాహసం చెయ్యటం తప్పఇంకేమి చెయ్యగలను...
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment