
చెలియా పలుకులే ముత్యాలగా, ఆమె నవ్వే మకరందం మనుకున్నానే ... విరబూసిన చెలియా మోమునె నాలో ఉపిరిగా నిలిపుకున్నానే ...
చెలి గజ్జెల గల గల నాదం నా గుండె చప్పుడికి తోడూ చేసుకున్నానే ...
చెలి ఆదరామ్రుతమె నా ప్రాణముగా, ఆమె నేనుగా భావించానే ...
పుష్పించే విరికి తుమ్మేదవంటు, నేల రాలే ప్రతి వర్షపు జల్లుకి నీవే హరివిల్లువంటు ఉహించానే ...
చీకటిలో వెన్నలల, నిదురలో మదుర స్వప్నంలా నీతో నా చెలిమి తోడూ వుండాలి అని బాసచేసానే
మరుజన్మలో కూడా నేను నీ తోడుంటానని పలికి నన్నునేను మరిచాను... ప్రియ నేస్తమా...!!
శ్రీరాం కుమార్ భాగవతుల
2 comments:
బాగుందండి.
abha oka danini minchi inkokati undi andi ramagaru...
Post a Comment