
పుష్పించే పువ్వు నేలరాలే క్షణాన నేనున్నానంటూ తోడూ వస్తుంది ఈ నేల
నేల రాలే ప్రతి వర్షపు బిందువుని కూడా నేనున్నానంటూ అక్కున చేర్చుకుంటుంది ఆ బీడు భూమి
నిత్యం ఎదురయ్యే చీకటిని సైతం తన ఒడిలోకి చేర్చుకొని వెలుగునిస్తుంది ప్రతి వేకువ
నీరాశతో నిత్యం జీవించే మనిషి జీవితంలో కూడా అందమైన ఆశలు నేరవేర్చే ప్రయత్నం చేస్తుంది అందమైన కల
మౌనమ్ వహించి వున్నా మాత్రమున మనసు మూగబోయింది అని భ్రమించటం ఆవివేకం
సన్నిహిత నేస్తం కోసం అన్వేషణ సాగిస్తూ .... బంధుత్వం మించిన స్నేహబంధంకై నిరిక్షిస్తుంది ...!!
మౌనం వహించిన మాత్రాన మనసు పలుక లేదని కాదు ..!
పలుకుల ప్రయాణంలో .... ఆత్మీయతాబాటని వెతుకుతూ...!! స్నేహమనే పూల బాట పొందే ఆ చిరుక్షణంలో ...! మౌనం అనే చిన్న ఎడబాటు కూడా మరిచిపోని అనుబంధంలో తియ్యని అనుబంధంగా,
సాగే జీవన స్మృతులలో ఆనంద దోలికలుగా భావిస్తాయి... ఎవ్వరు ఒంటరి కాదు అని అనుక్షణం మనసుకు గుర్తు చేస్తాయి
శ్రీరాం కుమార్ భాగవతుల