
ఆకలితో బ్రతుకుతున్నారు ఈనాటి రైతులు
కష్టం వారి తొడు చేసుకొని,
నాగలిని వారి ఆయుధంగా మార్చుకొని ...
చెమటని ఇంధనంగా ...
వారి ఆకలిని ఆశగా పెట్టుబదిపెడితే ...
నేల తల్లి పచ్చని పైరుగా మారి, వారిలో తెలియని ఒక కొత్త ఆశాకిరణాలకి ప్రాణం పోస్తుంది ... ఆ పంట
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వారి చూపులో ఆశ తప్ప నిరాశకి చోటుండదు
రేపటి ఉదయం మా కడుపు నింపు రోజు అని ఆలోచనికి ఆవకాశం కలిగిన క్షణాన ...

కళ్ళలో మెరుపును ... గొంతులో గాభిర్యం ... పరమశివుడి తపస్సుని సైతం భగ్నపరిచే శక్తి, యుక్తి కలిగి
రైతుల ఆశలు మాయమై... మేఘమై ఎవరు హర్షించని రీతిగా చిరు జల్లు నుంచి కుండపోతగా కురిసి ఎ సిఫార్సులకు లొంగక
అంతుచిక్క్యని తుఫానుగా మారి.. వారి ఆకలిని ఆకాలపు మృత్యువుల ఆవహిస్తుంది ...ఈ ప్రకృతీ...
ప్రకృతీ ఇది నీకు న్యాయమా ...
శ్రీరాం కుమార్ భాగవతుల
Published in Selayeru feature at http://www.aavakaaya.com/ on 10th మార్చ్ 2009
Published in Selayeru feature at http://www.aavakaaya.com/ on 10th మార్చ్ 2009
No comments:
Post a Comment