ప్రేమని పందిరిగా వేసి...

పెద్దల ఆశలను వేద మంత్రాలుగా చదివి ...
పంచభూతాల సాక్షిగా ... ఏడడుగుల సమ్మేళనతో ...
పెళ్లి అనే బంధంతో నవ జీవిత సాగరంలోకి అడుగుపెట్టి

ఆశల గాలికి కలతచెందక ... మార్పుల ప్రవాహనికి ఎదురు నిలిచి ...
మంచిని ఇంటిపేరుగా మలచి... మేమున్నాము అని చెయుతనిస్తూ ...
మరుగావ్వని ప్రేమని నింపి ... ఆత్మీయుత అనురాగాలకి మారుపేరుగా ...
సదా స్నేహపు జల్లులు కుమ్మరిస్తూ ...
ప్రతి క్షణం ... అనుక్షణం ... ఆనంద హరివిల్లుతో తమ వివాహ జీవితం వేల్లువిరియాలని ఆశిస్తూ...
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment