
ఏమి చెప్పను ?
ప్రతి క్షణం నన్ను నేను మరచి
నిన్నే తలచి నా శ్వాసలో నిన్నుంచి
మరుగవ్వని మన ప్రేమతో ... నీ తోడుతో ... జీవించాలని ఆశించాను
కాని ... చివరకు నీవు లేవని నిజం తెలిసి
నా మనసు నన్ను ప్రశ్నచినప్పుడు ?
ఆగిపోని ఈ గుండెతో నీవు లేని ఈ జీవితాన్ని ఉహించుకోలేక
నీవు రావు అని నిజం భరింపలేక
మౌనానికి భాదని తోడు చేసి
కన్నీళ్లను కలిపి నా జీవితమనే నావలో ప్రయాణం సాగిస్తూ
మరణం అనే తీరం కోసం ఎదురుచూస్తున్నాను ...
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment