ఓ మానవుడా
పెళ్లి అయిన కొత్తలో జీవితం నరకంగా మార్చే మగువ ఎట్టిదో చూడుము
ఉషోదయంతో చీపురు పట్టి కళ్ళాపు జల్లవలసిన ఆ నారిమణులు ... మగవారు ఇచ్చే కాఫీతో మేలుకొంటారు మరుక్షణం ...
ఆ ఆడువారు తమ ముఖారవిందమును సరి చేసుకుంటూ
సూర్య కిరణాలను ప్రక్కకు తోసి ఆతి సుఖుమారమైన హంసతల్పం నుంచి తమ పాదపద్మములను ఈ పృదివిపై మోపి కురులను సవరించుకొని
తమ నేత్రములతోనే శిలాశాసనం రాస్తూ ... భర్తా ఆడుగులను జాడలేకుండా చేసి ... భార్యాదాసుడిగా...
ఆమె హృదయ మందిరంలో సేవకుడిగా నిల్పి తమ అందముతో మగవాడి స్వేచ్చ జీవితానికి అడ్డు వస్తు అప్పుడప్పుడు కన్నీళ్ళు అనే అస్త్రంతో బ్రతుకు భారము చేస్తూ ప్రతి క్షణం క్షీణించి,
కృషింప చేసి చివరకు నీ జీవితాన్ని నరకప్రాయం చేస్తారు
ఓరి మానవుడా ఎందుకు నీ స్వేచ్చను నీవే అమ్ముకుంటావు ...
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment