
అగ్గిపుల్లతో వారిని సమాధి చేస్తున్న ఈ సమాజానికి ... నా ప్రణామాలు
మగువ జీవితాని కాళరాత్రికి మరో రూపంగా మార్చుతున్న ఈ సంప్రదాయనికి ... నా పాదాభి వందనాలు
ఓరి మానవుడా ఒక్క క్షణం ఇటు చూడు
జీవితమనే పాలసముద్రాన్ని మగువచే చిలికించి
వచ్చిన హలహలాన్ని ఆ మగువకు వదిలి అమృతాన్ని మాత్రం తామూ ఆస్వాదిస్తున్నారు... ఈ మగవారు
కష్టాల్లో నేనున్నానని తలపించే మగువ జీవితానికి
ఆ కష్టాలానే వరముగా ప్రసాదిస్తున్నారు ...
తానూ ఓడిపోతూ, కన్నిరై కరిగిపోతూ కూడా తన వారికోసం నిత్యం వెలుగుతూ తోడుగా నిలుస్తున్నారు ఆ స్త్రీముర్తులు
కాని వారి జీవితానికి మాత్రం లేదు నిజమైన ఓదార్పు ...
ఎప్పుడు వస్తుందో కదా...
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment