
ఏమని చెప్పామంటావు.....
ఏమని రాయమంటావు....
నా కనురేప్పలో దాగివున్నా కన్నీటి గురించా
దూరమై భారమవుతున్న మన స్నేహం గురించా
తలచిన మరుగావ్వని... ఆ జ్ఞాపకాలు గురించా
ఏమని చెప్పమంటావు...
ఒక్క క్షణం నా మనసులోని భావాలు ఈ విధముగా పలికాయి... సాయం సంధ్యా నిలిమేఘలా చాతుకేల్తున్న సమయంలో
నా మనసు పొరలు ఎగసి ఎగసి... ఆలసి సొలసి...
స్నేహపు జ్ఞాపకాల్ని తట్టి లేపినప్పుడు...
నాలోని ఆశ నీవు వున్నావు అనే భావం కలిగినప్పుడు
నా నెస్తానికి నా మనోభావం ద్వారా స్నేహ సందేశం ఇవ్వాలని కలతచెందాను కాని ..
బరువెక్కిన గుండెతో భారంగా శ్వాసపిలుస్తూ నా హృదయ వీణపై నీ కోకిల స్వరంతో ఆనంద భాషిని పలికించినప్పుడు కలం పట్టి కాగితానికి ఎక్కించే ప్రయత్నంలో నా కవిత కూడ సిగ్గుబోయింది...
ఇంక ఏమని చెప్పమంటావు.... ఏమని రాయమంటావు...
శ్రీరాం కుమార్ భాగవతుల
No comments:
Post a Comment