మెల్ల మెల్లగా సాగే గాలిలోపూల రేకుల గుసగుసలతో
మంచు ముత్యాలతో ...
తోలి సంధ్యా చిరు వెలుగులో
మృదుమధురమైన వీణా శ్రావ్యముతో
నా గుండె చప్పుడు నాకే తెలియని ఒక కొత్త అనుభూతిని కలిగించినప్పుడు ...
ఆ క్షణం నన్ను నేనే మరిచాను... ఆమెనే తలచాను
ఆ క్షణము నుంచి ...
నన్ను నేను మరచి నాలో నిన్నే వెతికాను
నిన్ను నేను చుచి నీ పిలుపుకై పరితపించాను
ప్రతి క్షణం నిన్నే ఉహించి కలతచెండాను
అప్పుడప్పుడు బాధని కుడా నీకై అలవాటుచేసుకున్నాను
కాని... "జీవిత" మనే సత్యం నా ముందు ఒక్క క్షణం ప్రస్పుటించిన క్షణాన
ఒక్కసారి యదార్ధ జీవితం లోకి తొంగి నన్ను నేను చూసుకున్నాను
ఇప్పుడిప్పుడే మారుతున్న యాంత్రిక జీవనంతో నన్ను నీను పోల్చుకున్నాను
మరు క్షణం నాలోని మార్పూకి ఆహ్వానం పలికించుకున్నాను
అసలు జీవితం అనే నిజాన్ని వెతికినప్పుడు .. నాలో నేనే ఈ స్పందించుకున్నాను
సాధించటానికి ఆశ ఒక్కటి చాలదని
ఆడుగేసిన మాత్రమున ఆకాశం అందధని
పలుగు పోటు పడకపోతే పంట చేతికి రాదనీ
కష్టాలే లేకపోతే జీవితానికి విలువ వుండదని
ఆచరణే అదృస్యమైతే ఆశలకి అర్ధం లేదని
నిజాన్ని గ్రహించుకున్నాను జీవితమనే సత్యాన్ని తెలుసుకున్నాను ...
శ్రీరాం కుమార్ భాగవతుల
Published in KOUMUDI TELUGU WEB MONTHLY in the month of January 2009
1 comment:
Post a Comment